: కనురెప్పలు కదిలిస్తున్నారు: మండేలా కుమార్తె
ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో ఉన్న దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా కనురెప్పలు కదిలిస్తున్నారని ఆయన పెద్ద కుమార్తె మకాజివే చెప్పారు. 'అబద్దం చెప్పలేను. నాన్న పరిస్థితి అస్సలు బాగోలేదు. అయితే స్పర్శకు ఆయన స్పందిస్తున్నారు. మేం పిలిస్తే స్పందించడానికి చేసే ప్రయత్నంలో కనురెప్పలు మాత్రం కదిలించగలుగుతున్నారు. కళ్లు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు' అంటూ మకాజివే తెలిపారు.