: ఈ రోజు, రేపట్లో మొత్తం యాత్రీకులను తరలించేస్తాం: బాబు


ఈ రోజు, రేపు జరుగనున్న సహాయక చర్యలతో ఇంచుమించు తెలుగువారంతా సురక్షితంగా స్వస్థలాలకు చేరుకుంటారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇందుకు రెండు విమానాలను ఏర్పాటు చేశామని, వాటిల్లో యాత్రీకులంతా హైదరాబాద్ చేరుకునే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు. నేటి సాయంత్రం 130 మందితో ప్రత్యేక విమానం హైదరాబాద్ బయల్దేరుతుందని అన్నారు. బదరీనాధ్ లో చిక్కుకున్న 230 మంది తెలుగు యాత్రీకులు కాలినడకన జోషీమఠ్ బయలుదేరారని, వారంతా రేపు సాయంత్రానికి డెహ్రాడూన్ చేరుకుంటారని, అక్కడ్నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News