: మీ బ్లడ్ గ్రూప్ ను బట్టే మీ డైట్!
బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, సంజయ్ దత్, హాలీవుడ్ నటులు డెమీ మూర్, మిరాండా కెర్, లిజ్ హర్లీ, కర్ట్ నీ కాక్స్ ల మధ్య కామన్ గా ఓ సామ్యముంది. అదేంటో చెప్పగలరా? తెలియడంలేదా, అయితే, ఇది చదవండి. వారందరూ మంచి నటులే కానీ, వీరందరూ ఒకే విధమైన డైట్ తీసుకుంటారు. అదే బ్లడ్ గ్రూప్ డైట్. అంటే, వారి బ్లడ్ గ్రూప్ కి నప్పే ఆహారం మాత్రమే స్వీకరిస్తారన్నమాట. బ్లడ్ గ్రూప్ కు సరిపడే ఆహారాన్ని తినడం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చని, తద్వారా వార్ధక్యం నుంచి శరీరాన్ని దూరంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు ప్రముఖ డైటీషియన్ దీపికా కాత్యాల్. ఒక్కో గ్రూపు రక్తం విభిన్నమైన శరీరధర్మాన్ని కలిగి ఉంటుందని కాత్యాల్ వివరించారు.
ఉదాహరణకు ఓ గ్రూపు రక్తం కలిగినవాళ్ళు రోజూ మాంసాహారం తీసుకోవాలట. ఎందుకంటే, ఆ బ్లడ్ గ్రూప్ ఎంతో పురాతనమైనదని, ఆదిమయుగాల్లో మానవులు వేట ప్రధానంగా జీవించేవారని కాత్యాల్ విపులీకరించారు. ఇక ఏ గ్రూప్ వాళ్ళు శాకాహారం స్వీకరించడం మేలని ఈ డైటీషియన్ సలహా ఇస్తోంది. వారు అగ్రేరియన్ నాగరికతకు చెందిన వారని వెజిటేరియన్ డైట్ సరిపోతుందని తెలిపింది. బి గ్రూప్ వాళ్ళు అన్నీ తినొచ్చట. మాంసం, చేపలు, కూరగాయలు, ఆకు కూరలు తీసుకుంటే సరిపోతుందని.. అదే ఏబీ గ్రూప్ వాళ్ళయితే పూర్తిగా ఫలాలపైనే ఆధారపడడం బెస్టని చెబుతోందీ డైటీషియన్. సో.. మనం కూడా మన బ్లడ్ గ్రూప్ ను అనుసరించి ఆహారం తీసుకుంటే సరి. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఆయుష్షునూ పెంచుకోవచ్చు.