: మోడీ ముంబై సమావేశానికి గడ్కరీ గైర్హాజరు
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్రలోని బీజేపీ సీనియర్ నేతలను కలుసుకున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రణాళికను పార్టీనేతలతో చర్చించేందుకు ఆయన ముంబై రాగా పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ గైర్హాజరయ్యారు. పార్టీ ఎన్నికల ప్రచార సారధిగా ఎన్నికయ్యాక మోడీ తొలిసారి మహారాష్ట్రలో అడుగుపెట్టారు. అయితే కీలకమైన సమావేశానికి గడ్కరీ డుమ్మా కొట్టడం పెనుదుమారం రేపుతోంది. అయితే వీసా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి రావడంతో గడ్కరీ గైర్హాజరయ్యారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ముంబైలో మోడీ రాజీవ్ ప్రతాప్ రూడీ, ప్రకాశ్ జవదేకర్, గోపీనాథ్ ముండే తదితర నేతలను కలుసుకున్నారు.