: కాఫీతో మరో లాభం కూడా ఉందట!
కాఫీతో ఎన్నో లాభాలున్నాయన్నది పరిశోధకులు చెప్పేమాట. అందులో కెఫీన్ ఎక్కువైతే మాత్రం చిక్కులు తప్పవని ఆ పరిశోధకులే హెచ్చరిస్తారు. కాఫీతో మానసికోల్లాసం పెంపొందడమే గాకుండా గుండె జబ్బులు, ప్రమాదకర మధుమేహం, కొన్ని రకాల కేన్సర్ల బారి నుంచి రక్షణ పొందవచ్చని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. తాజాగా గ్రిఫిత్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కాఫీతో మరో లాభం ఉందంటున్నారు. క్రమం తప్పకుండా కాఫీ తాగితే కిలోలకొద్దీ బరువు తగ్గొచ్చట. కాఫీలోని కెఫీన్ మానవుల్లో ఆకలిని మందగించేలా చేస్తుందని, తద్వారా బరువు కోల్పోవచ్చని పరిశోధనలో పాల్గొన్న మాట్ షూబెర్ట్ అనే విద్యార్థి తెలిపాడు.