: వీర జవానుకు సైనిక లాంఛనం
ఉగ్రవాదులతో పోరులో అసువులు బాసిన యాదయ్య అంత్యక్రియలు ఈ రోజు అతని స్వస్థలంలో జరిగాయి. జమ్మూ కాశ్మీర్ రాజధానిలో శ్రీనగర్ శివార్లలో ఉగ్రవాదుల ఆకస్మిక దాడిలో 8 మంది సైనికులు అసువులు బాశారు. వారిలో మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డి గ్రామానికి చెందిన జవాను యాదయ్య కూడా ఒకరు. ఈ ఉదయం ఆయన మృతదేహాన్ని ఇక్కడికి తరలించి సైనిక లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.