: అమర్ నాథ్ యాత్ర ప్రారంభం
3,157 మంది యాత్రీకులతో తొలి బృందం నేడు అమర్ నాథ్ యాత్ర ప్రారంభించింది. పటిష్టమైన భద్రత మధ్య దక్షిణ కాశ్మీర్ నుంచి ఈ బృందం బయలుదేరింది. వీరిలో 563 మంది మహిళలు, 37 మంది బాలలు ఉన్నారని అధికారులు తెలిపారు. జమ్మూ బేస్ క్యాంప్ నుంచి ఆ రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి జీఏ మీర్ జెండా ఊపి యాత్ర ప్రారంభించారు.