: బతికుండగానే మండేలా మరణించాడన్న ఆస్ట్రేలియా మంత్రి
ఆస్ట్రేలియా మంత్రి గ్యారీ గ్రే చేసిన తొందరపాటు ప్రకటన విమర్శలకు దారి తీసింది. పార్లమెంట్ భవనంలో బుధవారం పలువురికి విందు ఇచ్చిన ఈ మంత్రి, జాతి వివక్ష వ్యతిరేక నేత(మండేలా) మరణించాడంటూ ప్రకటించారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని నాలుక్కరుచుకున్నారు. ఆస్ట్రేలియాలో దక్షిణాఫ్రికా రాయబారిని కలిసి తన ప్రకటనకు మన్నించడంటూ క్షమాపణలు కోరారు.