: సిమ్స్ రికార్డులను సీజ్ చేసిన పోలీసులు
విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు దండుకుని డిపాజిటర్లను మోసగించిన సిమ్స్ సంస్థకు చెందిన కార్యాలయాలను పోలీసులు సీజ్ చేశారు. అలాగే ఆ సంస్థకు చెందిన రికార్డులన్నిటినీ కూడా సీజ్ చేసినట్లు డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఇప్పటికే సంస్థ ఎండీ సహా ఇద్దరు డైరెక్టర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వప్రసాద్ తెలిపారు.