: అమెరికాలో స్వలింగ సంపర్కుల ఆనందహేల
అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కేలిఫోర్నియా సహా ఆ దేశంలోని పలు ప్రాంతాలలో గేలు, లెస్బేనియన్లు(స్వలింగ సంపర్కులు) తెగ సంబరాలు జరుపుకుంటున్నారు. పురుషులు, పురుషుల్ని/ స్త్రీలు, స్త్రీలని వివాహం చేసుకోవడానికి అనుమతించాలంటూ ప్రభుత్వాన్ని అక్కడి సుప్రీంకోర్టు ఆదేశించడమే వారి అనందానికి కారణం. ఏ రాష్టాలలో అయితే చట్టం అనుమతిస్తుందో అక్కడ స్వలింగ వివాహాలకు అనుమతించాలని ఫెడరల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, కేలిఫోర్నియాలోనూ ఇలాంటి వివాహాలకు అనుమతిస్తూ కోర్టు మరో ప్రత్యేక ఉత్తర్వు జారీ చేసింది. దీంతో కేలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, సౌత్ మియామీ బీచ్, ఫ్లోరిడా, న్యూయార్క్ లో వేలాది మందిగా స్వలింగ సంపర్కులు అలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు.