: మండేలా మరణించినట్లే?
దక్షిణాఫ్రికా జాతిపిత, గాంధేయవాది, ఆ దేశ మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా దాదాపుగా మరణించినట్లేనని వైద్య నిపుణులు భావిస్తున్నారు. 95 ఏళ్ల వయసుకు చేరుకున్న మండేలా గత ఏడాదిగా పలుమార్లు అనారోగ్యంతో ఆస్పత్రి పాలై విడుదలయ్యారు. కానీ, ఈసారి మాత్రం ఆయన తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో పూర్తి విషమ పరిస్థితుల్లో ఉన్నారు. వారం దాటినా ఇప్పటికీ మండేలాలో చలనం లేదు. కేవలం వెంటిలేటర్ పైనే ఆయన జీవించి ఉన్నారు.