: సిక్స్ ప్యాక్ లకు పడిపోనంటున్న బాలీవుడ్ బ్యూటీ
సిక్స్ ప్యాక్ అంటే తనకు అయిష్టమని చెబుతోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్. సిక్స్ ప్యాక్ లకు పడిపోనని కరాఖండీగా చెబుతోంది. ప్రస్తుతం కంగన.. హృతిక్ రోషన్ హిట్ సినిమా 'క్రిష్' సీక్వెల్ 'క్రిష్-3'లో నటిస్తోంది. ఆ సినిమా సంగతులను ఓ మ్యాగజైన్ తో పంచుకుంటూ.. తన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా పంచుకుంది. భారతీయ కు అమ్మాయిల పట్ల అపోహలున్నాయని అంటోంది కంగన. మగువల చూపులకు బాగుంటే చాలని పురుషులు అనుకుంటారని.. కానీ, అతివలు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచేందుకు ఎల్లప్పుడూ ముందుంటారని వివరించింది. తన మనసుకు నచ్చిన మగాడు ఎలా ఉండాలో చెబుతూ.. తెలివిగలవాడై ఉండాలని స్పష్టం చేసింది. ఇక, సిక్స్ ప్యాక్ లకు ఫిదా అయ్యే అమ్మాయిల్లో తానుండనని స్పష్టం చేసింది.