: 'బ్రహ్మణి' భూముల స్వాధీనానికి ఏర్పాట్లు
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో బ్రహ్మణి ఉక్కు పరిశ్రమకు కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్డీవో రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఈ ప్రాంతంలో కొలతలు ప్రారంభించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 10,600 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ అధికారులు సమాయత్తమయ్యారు.