: సహాయ చర్యలను ఏపీ భవన్ నుంచి సమీక్షిస్తున్న సీఎం గారు
ఉత్తరాఖండ్ లో చిక్కుకుపోయిన తెలుగువారిని రక్షించేందుకు చేపట్టిన సహాయచర్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడి ఏపీ భవన్ నుంచి ఆయన ఫోన్ లో సహాయకార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. సంఘటన స్థలాలకు వెళ్ళి ప్రత్యక్షంగా సహాయకార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ లకు సూచించారు.