: కొట్లాటకు ఇక్కడ మైదానాలున్నాయి: సీపీఐ నారాయణ
డెహ్రాడూన్ లో రాష్ట్ర ఎంపీల ఘర్షణ కుక్కల కొట్లాటలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. కొట్టుకోవడానికి రాష్ట్రంలో చాలా పెద్ద మైదానాలున్నాయని సూచించారు. అంతేగానీ, ఎక్కడో తన్నుకుని రాష్ట్ర పరువు తీయడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు.