: గోదావరికి భారీగా వరద నీరు
గోదావరికి భారీగా వరదనీరు వస్తోంది. రాత్రి నుంచీ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద నీటిమట్టం 28 అడుగులకు చేరుకుంది. 30 అడుగులు దాటితే ప్రమాదకరంగా పరిగణిస్తారు. రాజమండ్రిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 9. 5 అడుగులకు చేరుకుంది. అన్ని గేట్లనూ ఎత్తి 1.2లక్షల క్యూసెక్కుల వరద నీటిని కిందికి విడిచిపెడుతున్నారు. వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.