: స్పూను రంగుతో రుచి మారుతుందట


మనం భోజనానికి వాడే స్పూను రంగుతో ఆహారం రుచి మారుతుందని ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మనం భోజనానికి వాడే వెన్న రాసుకునే కత్తితో జున్ను తిని చూడండి. అప్పుడు నాలుకకి కాస్త ఉప్పగా అనిపిస్తుంది. అసలు భోజనానికి వాడే స్పూన్లే కాదు... మనం తినేందుకు వాడే కంచాలు, గాజు గ్లాసులు వంటివాటికి కూడా ఇదే విషయం వర్తిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే, చల్లని అనుభూతిని ఇచ్చే రంగుల్లో ఉన్న గాజు గ్లాసుల్లో ఏదైనా పానీయాన్ని తాగినట్లయితే మనకు చాలా ఉల్లాసంగా అనిపిస్తుందట. అలాగే పెరుగును తెల్లగా ఉండే స్పూనుతో తింటే అది కమ్మగా అనిపిస్తుందని, అలా కాకుండా నల్లగా ఉండే స్పూనుతో తిన్నట్లయితే పెరుగుకు కాస్త పులుపు రుచి వచ్చినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు భోజనానికి కూర్చునే ముందు కంచంలో వడ్డించుకుని తినేందుకు ఉపక్రమించే సమయంలో మన మెదడు ఆ పాత్రను బట్టి సదరు పదార్ధం రుచికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చేస్తుందట. దీంతో మనం తీసుకునే ఆహారం రుచిలో తేడా వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే మనం భోజనానికి వాడే పాత్రలు, స్పూనులు, ఫోర్క్‌ లాంటి వాటిని మనకు నచ్చిన రంగులు ఎంచుకుంటే అప్పుడు ఆహారంలోని ఆనందాన్ని ఆస్వాదించవచ్చు.

  • Loading...

More Telugu News