: మాటలు నేర్చిన మరబొమ్మ!
రోబోలు మాట్లాడతాయా... ఏమో చిట్టి లాంటి రోబోలు మాట్లాడతాయేమో... ఇటీవలే తనలాగే ఉన్న ఒక రోబోను రూపొందించిన శాస్త్రవేత్త దానితో ఏకంగా ప్రపంగాన్నే ఇప్పించేశారు. అయితే ఈ కొత్త రోబో భూమిపైన మాట్లాడటం కాదు... ఏకంగా అంతరిక్షం నుండి మనుషులతో మాట్లాడేందుకు కూడా సిద్ధమవుతోంది. జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ రోబో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఏకంగా ప్రయాణం చేయనుంది. అంతేకాదు అక్కడి నుండి కిందనున్న శాస్త్రవేత్తలతో సంభాషించనుంది కూడా!
జపాన్‌కు చెందిన మాట్లాడే రోబో ఆస్ట్రనాట్ పేరు కిరిబో. ఈ కిరిబోను నైరుతి జపాన్‌లోని టనేగషియా అంతరిక్ష కేంద్రం నుండి ఆగస్టు 4న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించనున్నారు. 34 సెంటీమీటర్ల పొడవు, కేజీ బరువు ఉండే ఈ కిరిబో అంతరిక్షంలోకి వెళితే ఇక అక్కడి నుండి మనుషులతో సంభాషించనుంది. ఇదే జరిగితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంనుండి రోబోకు, భూమిపైన ఉన్న మనుషులకు మధ్య తొలిసారిగా సంభాషణ జరగనుంది.