: బాధితులను సాదరంగా ఆహ్వానించిన నారా లోకేశ్
డెహ్రాడూన్ నుంచి వరద బాధితులతో బయల్దేరిన విమానం హైదరాబాద్ చేరుకుంది. వారికి శంషాబాద్ విమానాశ్రయంలో నారా లోకేశ్ సాదరంగా స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విమానంలో 105 మంది రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. కాగా, బాధిత యాత్రికులను శంషాబాద్ నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసింది. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరో విమానంలో 116 మంది బాధితులు రాష్ట్రానికి చేరుకున్నారు.