: దొరికిన హెలికాప్టర్ కాక్ పిట్ వాయిస్ రికార్డర్
ఉత్తరాఖండ్ లోని గౌరీకుండ్ వద్ద నిన్న హెలికాప్టర్ కూలిన ఘటనలో 20 మంది మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ఆ హెలికాప్టర్ కు సంబంధించిన కాక్ పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లయిట్ డేటా రికార్డర్ లభ్యమయ్యాయి. వీటిని పరిశీలిస్తున్న భారత వాయుసేన ప్రమాద కారణాలను అన్వేషించే పనిలో నిమగ్నమైంది. వరదల్లో చిక్కుకుపోయిన బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చే క్రమంలో ఈ ఎంఐ-17 హెలికాప్డర్ ను ప్రతికూల వాతావరణం కబళించింది. ఈ ఘటనలో ఏ ఒక్కరూ బతికి బయటపడతారని తాము భావించడంలేదని వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఎన్ఏకే బ్రౌనీ అన్నారు.