: వాయిదాపడ్డ కేదార్ నాథ్ సామూహిక అంత్యక్రియలు
కేదార్ నాథ్ వరద మృతుల అంత్యక్రియలకు వాతావరణం అనుకూలించడం లేదు. మంగళవారం సామూహిక అంత్యక్రియలు జరగాల్సి ఉండగా భారీ వర్షాలు మరోసారి ఉత్తరాఖండ్ ను చట్టుముట్టడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. నేడు కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో అంత్యక్రియలు మరోసారి వాయిదా వేశారు. కేదార్ నాథ్ వెళ్లిన సైన్యం, వైద్యుల బృందం వాతావరణం అనుకూలించకపోవడంతో వెనుదిరిగింది.