: విండీస్ ఫ్లయిటెక్కిన టీమిండియా


కరీబియన్ దీవుల్లో జరిగే ముక్కోణపు టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు నేడు వెస్టిండీస్ పయనమైంది. ఇంగ్లండ్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన ధోనీ సేన నేడు లండన్ నుంచి టోర్నీకి వేదికైన జమైకా బయల్దేరింది. చాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ట్విట్టర్ లో ఈ విషయాన్ని పంచుకున్నాడు. 'ఇప్పుడు జమైకా వెళుతున్నాం. మరో 'మిషన్' ముందుంది. ఇంగ్లండ్ లో బాగా ఎంజాయ్ చేశాం' అని ట్వీటాడు.

ఇక ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ట్విట్టర్లో కామెంట్ చేశాడు. 'జమైకా వెళ్ళేందుకు విమానం ఎక్కాం, మాతోపాటు మరో స్పీడ్ గన్ ను తీసుకెళుతున్నాం' అంటూ బెంగాల్ పేసర్ మహ్మద్ షమి ఫొటోను ట్విటర్లో ప్రదర్శించాడు. సీనియర్ ఆల్ రౌండర్ ఇర్సాన్ పఠాన్ కు గాయం కావడంతో అతడి స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ షమిని జట్టుకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా, భారత్ తో పాటు విండీస్, శ్రీలంక జట్లు పాల్గొనే ముక్కోణపు టోర్నీ ఈ నెల 28 నుంచి జులై 2 వరకు జరగనుంది. టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఈ నెల 30న ఆతిథ్య విండీస్ తో ఆడుతుంది.

  • Loading...

More Telugu News