: బాబూ నీకిది తగునా: వీహెచ్


చంద్రబాబు నాయుడు జాతీయ నాయకుడు. అలాంటి వాడు ఇక్కడకు రావడమేంటి? అని అన్నందుకే టీడీపీ ఎంపీలు తనమీద దూకుడు ప్రదర్శించారని కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ ఆరోపించారు. తొమ్మిదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసి, జాతీయ నాయకుడి స్థాయిలో ఉన్న బాబు ఒకరిద్దర్ని కలిసేందుకు రావడమేంటని, నీ స్థాయి తగ్గించుకోకని బాబుకు సూచించానని, అంతే తప్ప తాను గొడవకు దిగ లేదని వీహెచ్ తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు పార్టీలు, రాజకీయాలు ఏంటని, తమ ఫ్లైట్ ముందు వచ్చినందున అందులో వెళ్లిపోవాలని సూచించానని, దాన్ని టీడీపీ వివాదంగా మలచుకుందని వీహెచ్ ఆరోపించారు. ఇక్కడ బాధితులకు న్యాయం జరగడమే ప్రధానమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News