: పాకిస్తాన్ లో మరోసారి నెత్తురోడింది
పొరుగుదేశం పాకిస్తాన్ మరోసారి నెత్తురోడింది. ఓ న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రదాడుల్లో 10 మంది మరణించారు. పాక్ వాణిజ్య రాజధాని కరాచీలో ఈ సంఘటన జరిగింది. సింధ్ ప్రావిన్స్ హైకోర్టు న్యాయమూర్తి మక్బూల్ బఖీర్ ను హతమార్చే యత్నంలో.. కరాచీలో జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఓ బైక్ పై బాంబును అమర్చారు. బఖీర్ సరిగ్గా ఆ బాంబు ఉన్న ప్రాంతంలోకి రాగానే.. పెద్దపెట్టున పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో న్యాయమూర్తికి తీవ్రగాయాలు కాగా.. ఆయన డ్రైవర్ సహా పదిమంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి బాధ్యులమని ఏ తీవ్రవాద సంస్థ కూడా ఇప్పటివరకు ప్రకటించకపోయినా.. తెహ్రీక్-ఏ-తాలిబాన్ పనే అని పోలీసు అధికారులు భావిస్తున్నారు. బాంబును పేల్చేందుకు రిమోట్ కంట్రోల్ వినియోగించారని పోలీసులు తెలిపారు.