: మమ్మల్ని ధొనీతో పోల్చడం అన్యాయం: గవాస్కర్


ధోనీని మాజీ కెప్టెన్లతో పోల్చడం అన్యాయమని మాస్టర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. మహేంద్రుడు మూడు టైటిళ్లు సాధించిన కెప్టెన్ గా రికార్డులకెక్కాడని, అయితే తాము ఆడినప్పటి కాలమాన పరిస్థితులు వేరని ఆయన తెలిపారు. ధోనీయే ఉత్తమ కెప్టెన్ అన్న ప్రచారంపై స్పందించిన గవాస్కర్, భిన్న తరాల మధ్య పోలిక తేవడం సరికాదని సూచించారు. ధోనీ ఉత్తమ నాయకుల్లో ఒకరని, అంతే కానీ ధోనీయే అత్యుత్తమం కాదని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. కాగా అజయ్ జడేజా మాట్లాడుతూ కెప్టెన్లుగా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సాధించిన కల్నల్ సీకే నాయుడు, కపిల్, అజ్జూ, గంగూలీల సరసన ధోనీని నిలబెట్టవచ్చని, వరల్డ్ కప్, టీ ట్వంటీ వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లను అందించాడని కొనియాడారు.

  • Loading...

More Telugu News