: ఏ చానల్ చూసినా వీహెచ్-రాథోడ్ రగడే..


టీవీ చానళ్ళకు వీక్షకులే దేవుళ్ళు. వారిని అలరించేందుకు ఆ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు చేసే ప్రయత్నాలు సర్కస్ ఫీట్లను తలపిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. కొంచెం మానవాసక్తికర అంశమని పసిగట్టారో వెంటనే అక్కడ వాలిపోతారు చానళ్ళ ప్రతినిధులు. లైవ్ లో తమ ప్రేక్షక దేవుళ్ళకు ఆ ఘటన వివరాలు అందించేందుకు పోటీ పడతారు. తాజాగా.. డెహ్రాడూన్ లో ఎంపీలు వి. హనుమంతరావు, రమేశ్ రాథోడ్ ల మధ్య తోపులాట చోటు చేసుకోగా.. చానళ్ళు ఆ ఫైట్ సీన్ ను ప్రసారం చేస్తూ తమ రేటింగ్స్ పెంచుకునే పనిలో పడ్డాయి. తెలుగులో ఏ చానల్ చూసినా వీహెచ్, రాథోడ్ లు ఒకరినొకరు తోసుకుంటున్న దృశ్యాలే. వీరిని సముదాయించే క్రమంలో కొనకళ్ళ సత్యనారాయణ కూడా రగడలో భాగస్వామిగా మారాల్సివచ్చింది. ఈయనపైనా వీహెచ్ తన ఆగ్రహం ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News