: మూడో వంతు తగ్గిన ఆహార ధాన్యాల సేకరణ
ఈ ఏడాది ఆహార ధాన్యాల సేకరణ మూడో వంతు తగ్గింది. 2013-14 సంవత్సరానికి గాను ఎఫ్ సీఐ 25.08 మిలియన్ టన్నుల గోధుమలను సేకరించింది. గత ఏడాది 37.35 మిలియన్ టన్నులు ఉండగా ఈ ఏడాది 12.17 మిలియన్ టన్నుల గోధుమల సేకరణ తగ్గింది. మరో వైపు ప్రేవేటు వర్తకులు ఎక్కువగా కొనడంతో ఎఫ్ సీఐ సేకరణకు ధాన్యం 28.23 శాతం తక్కువగా వచ్చినట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధరకంటే ప్రైవేటు వర్తకులు అధిక మొత్తం చెల్లించడం వల్లే రైతులు ప్రైవేటు వర్తకులకు ధాన్యం విక్రయించేందుకు మొగ్గు చూపారని ఎఫ్ సీఐ అధికారులు చెబుతున్నారు.