: సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
వివిధ
జిల్లాల సహకార సంఘాలకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ
ఆధిపత్యం ప్రదర్శించింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని స్థానిక సంస్థల
ఎన్నికలకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. చిత్తూరు జిల్లా డీసీసీబీ
స్థానాల్లో 11 కాంగ్రెస్ కు, 3 టీడీపీకి దక్కాయి. కర్నూలు జిల్లాలో
కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 స్థానాలను చేజిక్కించుకుంది.
కృష్ణా జిల్లాలో డీసీసీబీ డైరక్టర్ల ఎన్నికల్లో 8 కాంగ్రెస్ గెలుచుకోగా 1
టీడీపికి దక్కింది.
ఇక తెలంగాణ విషయానికొస్తే... మెదక్ లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. డీసీసీబీ డైరక్టర్ల ఎన్నికల్లో 13 స్థానాలు దక్కాయి. డీసీఎంస్ ఎన్నికల్లోనూ పదింట ఎనిమిది చేజిక్కించుకుంది. నిజామాబాద్ లో డీసీసీబీ కాంగ్రెస్ పరం కాగా డీసీఎంస్ తెరాస, వైఎస్సార్ కాంగ్రెస్ కూటమి దక్కించుకుంది. నల్గొండ జిల్లాలో 16 డీసీసీబీ స్థానాల్లో 10 కాంగ్రెస్ నెగ్గింది. డీసీఎంస్ ఎన్నికల్లో మూడింట మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది.
కాగా, కొంత గందరగోళం నెలకొన్న కడప సహకార ఫలితాల్లో స్పష్టత వచ్చింది. వైఎస్సార్సీపీ నెగ్గినట్టు అధికారులు ప్రకటించారు. డీసీఎంస్ లో మొత్తం 7 స్థానాలు వారికే దక్కాయి. ప్రకాశం జిల్లా డీసీఎంస్ కాంగ్రెస్ నే వరించగా, ఖమ్మం డీసీసీబీ, డీసీఎంస్ పదవులు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.
మరోవైపు మహబూబ్ నగర్ లోడీసీసీబీ, డీసీఎంస్ పదవులు కాంగ్రెస్ వశమయ్యాయి. 16 డీసీసీబీ స్థానాలకు గాను 12 కాంగ్రెస్ నెగ్గగా మరో నాలుగు స్థానాల ఫలితాలను రేపు వెల్లడిస్తారు. డీసీఎంస్ లో 6 స్థానాలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. పశ్చిమ గోదావరి డీసీఎంస్ ఎన్నికల్లో కాంగ్రెస్ 6, టీడీపీ 3, వైఎస్సార్సీపీ 1 గెలుచుకున్నాయి. తూర్పు గోదావరి డీసీసీబీ లో కాంగ్రెస్ కు తిరుగులేకుండా పోయింది. మొత్తం 20 డైరక్టర్ పదవులనూ ఎగరేసుకెళ్లింది.