: చంద్రబాబు కొత్త ఎత్తుగడ ఇది: వీహెచ్
డెహ్రడూన్ ఎయిర్ పోర్టులో జరిగిన సంఘటన.. చంద్రబాబునాయుడు వేసిన కొత్త ఎత్తుగడ అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అభివర్ణించారు. 'ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కదా. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రచారం చేసుకుందామని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. అందుకే ఇక్కడ ఈ వివాదం రేపాడు. ఇంతవరకు వాళ్ల విమానమే రాలేదు. ఇప్పుడొచ్చిందది' అని వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు.