: కారు డ్రైవర్ ను కిడ్నాప్ చేశారు: చంద్రబాబు


బాధితులను రక్షించడానికి వస్తే కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. డెహ్రడూన్ ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, తెలుగుదేశం నాయకుడు రమేష్ రాథోడ్ మధ్య జరిగన తోపులాటపై ఆయన స్పందించారు. 'మా విమానం దగ్గరకు వెళ్లేందుకు బాధితులు కారులో కూర్చోగా, కాంగ్రెస్ వాళ్లు కారు డ్రైవర్ ను కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. అత్యంత హేయమైన ఘటన ఇది. బాధితులు సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే ముఖ్యం. వారు ఏ విమానంలో వెళ్లినా నాకు అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ రాజకీయాలు వద్దని మాత్రం చెబుతున్నాను' అన్నారు చంద్రబాబునాయుడు.

  • Loading...

More Telugu News