: ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ మమతా బెనర్జీ


పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లోని జాంబోలీలో ప్రచారం చేపడుతున్న మమతా బెనర్జీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై పంచాయతీ ఎన్నికలను జరగనీయకుండా చూసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఓడిపోతామన్న భయంతోనే ప్రత్యర్ధి పార్టీలవారు కేసులు పెడుతూ, ఎన్నికలు ఆపేందుకు కుయుక్తులు పన్నుతున్నారని దీదీ దుయ్యబట్టారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో తాను ప్రచారానికై ప్రజల వద్దకు వస్తే ఈ మూడు పార్టీల నేతలు ఎన్నికలు ఎలా ఆపాలా? అని ఆలోచిస్తూ, డబ్బులు ఖర్చుపెడుతూ, ఎత్తుగడలు వేస్తున్నారని మమత మండిపడ్డారు.

  • Loading...

More Telugu News