: బాబూ..వరదల్లోనూ రాజకీయమా?: కాంగ్రెస్ ఫైర్


ఉత్తరాఖండ్ వరదల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, రుద్రరాజు పద్మరాజు ఆరోపించారు. ప్రచారం పొందడానికే బాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వారు ఆక్షేపించారు. వరద బాధితుల సహాయార్థం విరాళాలు ఇవ్వడం మాని ఇలా మాట్లాడడం సరికాదని బాబుకు హితవు పలికారు. 2747 మంది యాత్రికులు మనరాష్ట్రం నుంచి ఉత్తరాఖండ్ వెళ్ళారని.. వారిలో 1553 మంది బాధితులకు ప్రభుత్వ సాయం అందిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు వివరించారు.

  • Loading...

More Telugu News