: వ్యభిచార గృహంపై దాడి... పోలీసుల అరెస్టు!
హైదరాబాద్ శివారులోని సరూర్ నగర్ లోని ఒక వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. అయితే అక్కడ విటులు, వ్యభిచారిణులను అరెస్టు చేయాల్సిన పోలీసులు, ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా అరెస్టు చేశారు. వ్యభిచార గృహంలో గత కొంత కాలంగా వసూళ్లకు పాల్పడుతూ, స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్న వాసు, పరమేశ్వర్, అశొక్ అనే పోలీసుల తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఇన్స్పెక్టర్ ఈ దాడి నిర్వహించారు. వ్యభిచారగృహంలో వసూళ్లకు పాల్పడుతుండగా సదరు పోలీసులను అరెస్టు చేశారు. అందులో ఇద్దరు పట్టుబడగా అశోక్ పరారయ్యాడు.