: బ్యాంకు సేవల్లో దక్షిణాది వారిదే పైచేయి
బ్యాంకుల ద్వారా ఆర్థిక సేవలను అందుకోవడంలో, బ్యాంకు శాఖల అందుబాటు విషయంలో దక్షిణాది రాష్ట్రాలే మెరుగ్గా ఉన్నాయని రేటింగ్ సంస్థ క్రిసిల్ వెల్లడించింది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించిన గుజరాత్, మహారాష్ట్రలు కూడా ఈ విషయంలో దక్షిణాది కంటే వెనుకనే ఉండడం విశేషం. తమిళనాడులోని పుదుచ్చేరి జిల్లా టాప్ ప్లేస్ లో ఉంది. చండీగఢ్, కేరళ రాష్ట్రం, గోవా, డిల్లీ వరుసగా ఐదో స్థానం వరకూ ఉన్నాయి. రాష్ట్రంలో రంగారెడ్డి ముందంజలో ఉంది. ప్రతీ లక్ష మంది ప్రజల డిపాజిట్లు, లోన్ల ఆధారంగా క్రిసిల్ బ్యాంకు సేవలపై ఈ నివేదిక రూపొందించింది.