: డాలర్ దెబ్బకు పసిడి కుదేల్
అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రగతి కార్యక్రమాలు బంగారాన్ని దెబ్బ తీస్తున్నాయి. ఆ వ్యవస్థ నుంచి సానుకూల వార్తలు వస్తుండటంతో మదుపుదారులు బంగారాన్ని అమ్మేస్తున్నారు. పసిడిలో నుంచి పెట్టుబడులను స్టాక్ మార్కెట్ తోపాటు, డాలర్లలోకి మళ్లిస్తున్నారు. ఫలితంగా బంగారం ధర మూడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఔన్స్ ధర 25 డాలర్ల దాకా కోల్పోతూ 1251 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. గరిష్ఠ స్థాయి అయిన 1920 డాలర్ల నుంచి చూస్తే ఔన్స్ ధర దాదాపు 700 డాలర్లు కోల్పోయింది. తాజా పరిణామాలు చూస్తుంటే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర మరింతగా పడే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు.