: 48 గంటల ముందు క్యాన్సిల్ చేసుకుంటేనే ఫుల్ చార్జీ


రిజర్వేషన్ క్యాన్సిలేషన్ నిబంధనలను రైల్వే శాఖ సమూలంగా మార్చివేసింది. దీని ప్రకారం ఇకపై రైలు బయల్దేరే సమయానికి 48 గంటల ముందు రిజర్వేషన్ టికెట్టు రద్దు చేసుకుంటేనే పూర్తి చార్జీ వాపసు వస్తుంది. అది ఇప్పటి వరకూ 24 గంటలుగా ఉంది. వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు మరింత ముందుగా కన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మార్పు చేశారు. 48 గంటల నుంచి రైలు బయల్దేరే సమయానికి ఆరు గంటల్లోపు రద్దు చేసుకుంటే 75శాతమే వెనక్కి వస్తుంది. ఇక రైలు టైమ్ కు ఆరు గంటల ముందు నుంచి రైలు వెళ్లిన రెండు గంటల్లోపు రద్దు చేసుకుంటే 50 శాతం వెనక్కి తిరిగి ఇస్తారు. ఏసీ ఫస్ట్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రిజర్వేషన్ టికెట్ రద్దు చేసుకుంటే ప్రతీ ప్రయాణికుడిపై రూ.120, ఏసీ 2 టైర్ వారికి రూ.100, 3టైర్ వారికి రూ.90, ఎకానమీ, చైర్ కార్ వారిపై 60 రూపాయల చార్జీని మినహాయిస్తారు.

  • Loading...

More Telugu News