: భారత్‌ అంగారకయాత్రలో నాసాకు భాగస్వామ్యం


ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న భారత్‌ అంగారక యాత్ర కార్యక్రమంలో అమెరికాకు చెందిన నాసా కూడా భాగస్వామ్యం వహించనుంది. 450 కోట్ల రూపాయల విలువైన మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ ను ఈ ఏడాది.. అక్టోబరు, నవంబరు మధ్యకాలంలో శ్రీహరికోట నుంచి ప్రయోగించాలని అనుకుంటున్నారు.

ఈ కార్యక్రమానికి నాసా కొంత మేరకు సాంకేతిక సాయం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో భారతీయ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ కనిపించకుండా ఉండే సమయంలో... అవసరమైన సాంకేతిక సాయం.. డీప్‌ స్పేస్‌ నావిగేషన్‌ అండ్‌ ట్రాకింగ్‌ పరంగా నాసా సహకారం అందిస్తుంది. ఈ విషయాన్ని యుఎస్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

భారతీయ అంగారక గ్రహ యాత్రకు సహకారం అందించాలనే నిర్ణయం మార్చిలోనే తీసుకున్నప్పటికీ.. దాన్ని ఇప్పుడే బయటపెట్టారు.

  • Loading...

More Telugu News