: చిన్నారులకు ఇలా నేర్పడం సూపర్‌


పసిపిల్లలకు భాషను నేర్పడం, విషయాలపై అవగాహన కలిగించడం అనేది ఓ ఆర్ట్ . సహజంగా పిల్లల్లో గ్రాహ్యశక్తి పరిపూర్ణంగా ఉంటుంది. మనం ఏం నేర్పితే దానిని వారు చాలా తొందరగా నేర్చుకుంటారు. అయితే మనం ఎలా నేర్పుతున్నాం అనే పద్ధతి మీదనే.. వారి తెలివితేటలు కూడా ఆధారపడి ఉంటాయి.

షికాగో విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన ఒక స్టడీలో.. పిల్లలకు కొత్త సంగతులు, పదాలు నేర్పేప్పుడు వాటికి సంబంధించిన బొమ్మలను కూడా చూపిస్తూ నేర్పినట్లయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని తేల్చారు. దానివల్ల పిల్లల పదసంపద బాగా పెరుగుతుందిట. దృశ్యాలు చూస్తూ నేర్చుకోవడంలో పిల్లలు త్వరగాను, బాగా గుర్తుండేలాగానూ నేర్చుకుంటారుట. తల్లిదండ్రుల ఉచ్చారణలో నాణ్యత, చిత్రాలతో కూడి నేర్పడం అనేది వారి జ్ఞానాన్ని పెంచుతుంది. ఈ స్టడీ వివరాలను ప్రొసీడిరగ్స్‌ ఆఫ్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ పుస్తకంలో ప్రచురించారు కూడా!

  • Loading...

More Telugu News