: ఆస్తమా ఉపశమనంలో కీలకమైన ముందడుగు


ఆస్తమా వ్యాధితో బాధపడే వారికి ఇన్‌హేలర్‌ అంతో ఇంతో ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. ఇన్‌హేలర్‌ ద్వారా మందు తీసుకోవడం ఈ వ్యాధి వారికి కీలకం కాగా, సరైన మోతాదులో మందు తీసుకున్నామా? లేదా? అనేది వారికి ఎప్పటికీ ఒక అనుమానమే. సరైన మోతాదులో ఇన్‌హేలర్‌ ద్వారా మందు తీసుకోకుంటే వ్యాధి సాధారణంగా మరింత ముదురుతుంది. దీనిపై జోష్‌ దృష్టి సారించి.. పరిశోధనలు జరిపారు. త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఓ ఆధునిక ఇన్‌హేలర్‌ రూపొందించాడు. ఇందులోని ఒక సెన్సర్‌ దీని ద్వారా వెళ్లే గాలి వేగాన్ని లెక్కిస్తుందిట.

సరైన మోతాదులో మందు తీసుకుంటే ఆకుపచ్చలైటు వెలుగుతుంది. తక్కువ తీసుకుంటే ఎర్ర లైటు వస్తుంది. పైగా ధ్వని ద్వారా కూడా ఇది మనం తీసుకునే మోతాదును తెలియజేస్తుందట. ఈ మోతాదుల పరిశీలన అనేది ఆస్తమా బాధితులకు ఎంతో ఉపకరిస్తుంది.

తమాషా ఏంటంటే.. ఈ పరికరాన్ని కనుగొన్న బ్రిటన్‌ లోని నాటింగ్‌హాం విశ్వవిద్యాలయానికి చెందిన జోష్‌ అవెరిల్‌ స్వయంగా ఆస్తమా రోగి.. వారికుండే సాధకబాధకాలు ఆయనకు తెలుసు గనుకనే వాటికి తగ్గట్లుగా దీన్ని రూపొందించారట.

  • Loading...

More Telugu News