: తల్లిపాలు మన హోదాను కూడా పెంచుతాయిట


తల్లిపాలు పిల్లల ఆరోగ్యం విషయంలో ఎంత కీలకమైనవో మనకు తెలియని సంగతి కాదు. పైగా తల్లిపాల గురించి అవగాహన కల్పించడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే.. తల్లిపాలు.. పెరిగి పెద్దయిన తర్వాత.. పిల్లలు అందుకోగల సోషల్‌ స్టేటస్‌ను కూడా ప్రభావితం చేస్తాయనే కొత్త సంగతిని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనంలో నిరూపించారు.

1958, 1970 మధ్య జన్మించిన 34 వేల మందిపై కొన్నేళ్ల పాటూ వీరు ఒక భారీ సర్వే నిర్వహించారు. ఏం తేలిందంటే.. తమ బాల్యంలో తల్లిపాలు తాగిన వారి నాడీవ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతోందిట. దీనివల్ల వారి తెలివితేటలు మెరుగ్గా ఉన్నాయని గుర్తించారు. ఇందువల్ల వృత్తిపరంగా, సామాజికంగా తల్లిదండ్రులకంటె మెరుగైన స్థాయికి చేరుకుంటారని గుర్తించారు. తల్లిపాలు తాగేవారు ఉన్నతస్థానాలకు వెళ్లడం 24 శాతం ఎక్కువట. వీరిలో భావోద్వేగాల ఒత్తిళ్లు కూడా తక్కువే. జీవితంలో విజయాలకు ఇదీ ఒక కారణమేనని వారు తేల్చారు.

  • Loading...

More Telugu News