: వీర జవాన్లకు కాశ్మీర్లో ప్రధాని, సోనియా నివాళి
ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రధాని మన్మొహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం జమ్మూ కాశ్మీర్ లో అడుగుపెట్టారు. ఈ పర్యటనలో ప్రధాని, సోనియా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆరంభించనున్నారు. శ్రీనగర్ చేరుకున్న ప్రధాని, సోనియా నిన్న జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం కిష్టవర్ స్టేడియంలో జరిగిన పబ్లిక్ ర్యాలీలో కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఎప్పుడూ పైచేయి సాధించలేదని పునరుద్ఘాటించారు. అనంతరం 850 మెగావాట్ల హైడ్రోపవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిన్నటి దాడిలో చికిత్స పొందుతున్న జవానులను పరామర్శించారు. ప్రధాని, సోనియా పర్యటనతో భారీ భద్రతా ఏర్పాట్లు చేయడంతో శ్రీనగర్ లో కర్ఫ్యూ వాతావరణం కన్పించింది. హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాదులు మరిన్ని దాడులు చేస్తామని ప్రకటించడంతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు.