: బద్రీనాథ్ లో తెలుగు యాత్రీకులకు అండగా నిలిచిన టీడీపీ
ఉత్తరాఖండ్ యాత్రీకులను ఆదుకోవడంలో టీడీపీ ముందుంది. అధికార పార్టీగా కాంగ్రెస్ తప్పిదాలను ఎండగడుతూ టీడీపీ అధినేత ఢిల్లీలోనే ఉండడానికి తోడు ఎంపీలు ఎమ్మెల్యేలు వైద్యుల బృందంతో బాధితులను పరామర్శిస్తూ వారిని స్వస్థలాలకు చేరుస్తున్నారు. తాజాగా బద్రీనాథ్ లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రీకులకు టీడీపీ అండగా నిలిచింది. ఎంపీ రమేష్ రాధోడ్ అక్కడికి చేరుకుని యాత్రీకులను పరామర్శించారు. ఆంధ్రకు చెందిన యాత్రీకులకు 50 వేల రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు. బద్రీనాథ్ నుంచి అందర్నీ క్షేమంగా ఇళ్లకు చేరుస్తామని భరోసా ఇచ్చారు.