: 484 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు


చార్ ధామ్ యాత్రలకు వెళ్లిన వారి వివరాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. వివిధ జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన సమాచారం మేరకు రాష్ట్రం నుంచి చార్ ధామ్ వెళ్లిన వారి సంఖ్య 2,544. అయితే, అందులో 1200 మంది ఇప్పటి వరకూ స్వస్థలాలకు చేరుకున్నారు. మరో 900 మంది మార్గ మధ్యలో ఉన్నారు. కాగా, మరో 484 మంది యాత్రీకుల వివరాలు ఇంకా అందలేదు. బ్యాచ్ లు బ్యాచ్ లుగా వెళ్లిన వారు తమ కళ్లముందే గల్లంతయ్యారనీ, వారి వివరాలు అందజేసినప్పటికీ ఇంకా 484 మంది ఆచూకీ తెలియలేదనీ చెబుతూ, వారి బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News