: కిరణ్ ఢిల్లీ వచ్చింది అందుకోసమే: టిఆర్ఎస్
తెలంగాణను అడ్డుకునేందుకే కిరణ్ ఢిల్లీ వచ్చారని టిఆర్ఎస్ నేతలు కే.కేశవరావు, మందా జగన్నాథం ఆరోపించారు. వరద బాధితులను ఈ నేతలు ఈ రోజు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలోనూ తెలంగాణ ఇచ్చే సమయంలో కిరణ్ అడ్డుకున్నారని వారు చెప్పారు. లాఠీలు, తూటాలతో తెలంగాణ ప్రజలను అడ్డుకుంటానని ముఖ్యమంత్రి చెబుతున్నాడని వారు విమర్శించారు.