: జట్టులోకి రావడానికి తిరిగి అవకాశం కల్పించండి: శ్రీశాంత్
ప్రస్తుతం తనకు 30 ఏళ్లని, మరి కొద్ది సంవత్సరాలే క్రికెట్ ఆడే అవకాశం ఉందని శ్రీశాంత్ అంటున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో జైలుకు వెళ్లి బెయిల్ పై తిరిగొచ్చిన శ్రీశాంత్ ఈ రోజు భారత క్రికెట్ అవనీతి నిరోదక శాఖ చీఫ్ రవి సవాణిని కలుసుకున్నాడు. 'నేను ఏ తప్పూ చేయలేదని కొద్దిరోజుల్లోనే రుజువవుతుంది. నాకు ప్రస్తుతం 30 ఏళ్లు వచ్చాయి కాబట్టి, మరి కొన్ని సంవత్సరాలే క్రికెట్ ఆడగలను. అందుకే జట్టులోకి రావడానికి నాకు అవకాశం కల్పించండి' అంటూ సవాణికి అందించిన లేఖలో శ్రీశాంత్ స్పష్టం చేశాడు.