: ఆదర్శంగా సీఆర్పీఎఫ్ జవాన్లు
ఉత్తరాఖండ్ వరదలబారిన పడ్డవారిని రక్షించి ఆర్మీ జవానులు ప్రశంసలందుకుంటుండగా, ఉత్తరాఖండ్ సహాయక చర్యలకు 18 కోట్లు విరాళం ప్రకటించి సీఆర్పీఎఫ్ జవానులు అన్ని వర్గాలనుంచి మరిన్ని అభినందనలందుకుంటున్నారు. ఎటుచూసినా ప్రమాదం పొంచి ఉన్న దారుల్లో ప్రజలను రక్షించి జవానులు అందరిమొప్పు పొందారు. ఉత్తరాఖండ్ వరదబాధితులకు చేయూతనిచ్చేందుకు రాజకీయనాయకులు కేవలం లక్షలు విరాళంగా అందజేస్తే, సీఆర్పీఎఫ్ మాత్రం 18 కోట్ల రూపాయలను విరాళంగా అందజేయడం ప్రశంసనీయం. దీంతో బడాబాబులందరికీ సీఆర్పీఎఫ్ ఆదర్శంగా నిలుస్తోంది.