: మాజీ మంత్రి ధర్మానపై సుప్రీంకు సీబీఐ
జగన్ అక్రమాస్తుల కేసులో భాగమైన వాన్ పిక్ భూ కేటాయింపుల కేసులో మాజీమంత్రి ధర్మానను విచారించాలన్న సీబీఐ మెమోపై సీబీఐ కోర్టు వచ్చే నెల 18కి వాయిదా వేసింది. దీంతో ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీబీఐ నిర్ణయించింది. అప్పట్లో రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు వాన్ పిక్ కోసం అడ్డగోలుగా భూకేటాయింపులు జరిపి జగన్ సంస్థల్లోకి అక్రమ పెట్టుబడులకు సహకరించారని సీబీఐ అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.