: కేదార్ నాథ్ లో సహాయక కార్యక్రమాలు పూర్తి
కేదార్ నాథ్ ఆలయ సమీపంలో అన్వేషణ, సహాయక కార్యక్రమాలు పూర్తయినట్లు అధికారులు ఈ రోజు ప్రకటించారు. సైనిక, పారామిలటరీ దళాలు తమ కార్యక్రమాలను నిలిపివేశాయని నోడల్ అధికారి రవినాథ్ రామన్ తెలిపారు. కేదార్ నాథ్ చుట్టుపక్కల అడవుల్లో బాధితులు ఎవరూ చిక్కుకుని లేరని చెప్పారు. అందరినీ బయటకు తీసుకొచ్చేశామని ప్రకటించారు. ప్రస్తుతానికి జాతీయ విపత్తు నిరోధక దళం ఒక్కటే ఉందని తెలిపారు. మృతదేహాలు కుళ్లిపోయినందున వాటిని వెలికితీసే పరిస్థితి లేదని, ఎక్కడివాటిని అక్కడే దహనం చేస్తామని చెప్పారు.