: ఉగ్రవాదులు ఏం సాధించలేరు: ప్రధాని
ఉగ్రవాదులు ఎప్పటికీ ఏం సాధించలేరని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న మన్మోహన్ సింగ్ ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రధాని పర్యటన ముందురోజు ఉగ్రవాదులు సైనిక వాహనాలపై దాడి చేసి పదిమందిని చంపిన సంగతి తెలిసిందే. 'ఆ దుర్ఘటనలో పోరాడి చనిపోయిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఉగ్రవాదులు ఎన్ని వ్యూహాలు వేసినా అంతిమంగా వారు సాధించేదేమీ ఉండదు' అని చెప్పారు మన్మోహన్ సింగ్.