: ఉత్తరాఖండ్ విపత్తులో మూగజీవాల సంగతేంటి?


జలప్రళయంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం కేదార్ నాథ్, పరిసర ప్రాంతాల్లోని వారు వేలాది మంది వరదలకు కొట్టుకుపోయారని, జలసమాధి అయ్యారని ఇప్పటి వరకూ వార్తలు వింటున్నాం. అదే సమయంలో మూగజీవాల గురించి విస్మరిస్తున్నాం. మనుషులే కాదు, మూగ జీవాలు సైతం ఎన్నో బలవ్వగా మరెన్నో గాయలపాలయ్యాయి. చార్ ధామ్ లో భాగమైన నాలుగు క్షేత్రాలూ కొండల్లో సాగిపోయేవే. ఇక్కడ గుర్రాలు, గాడిదలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. వారం క్రితం వచ్చిన వరదల్లో వీటిలో చాలా వరకు కొట్టుకుపోయాయి. కొన్ని గాయాలపాలై పడి ఉన్నాయి. ఇప్పటి వరకూ చిక్కుకుపోయిన యాత్రీకులనే ఇంకా సురక్షితంగా బయటకు తీసుకురాలేదు. ఇక మూగజీవాలను ఎవరు పట్టించుకుంటారు? అందుకే రాజస్థాన్ రాష్ట్రం, జైపూర్ కు చెందిన పశువైద్యుడు ముఖద్దర్ అలీ, డెహ్రాడూన్ కు చెందిన 12 మంది ఉత్తరాఖండ్ వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని గాయపడ్డ మూగజీవాలకు చికిత్సలు చేస్తున్నారు. వీరికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం మందులతో కూడిన వ్యాన్ ను కూడా అందించింది.

  • Loading...

More Telugu News